తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - అనంతపురం గార్లదిన్నెలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి న్యూస్

ఏపీలోని అనంతపురం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె జాతీయరహదారి సమీపంలోని విద్యుత్ సబ్​స్టేషన్ వద్ద ఆగిఉన్న ఐచర్​ వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఏపీ: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఏపీ: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

By

Published : Dec 24, 2020, 8:01 PM IST

ఏపీ: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె జాతీయరహదారి సమీపంలోని విద్యుత్ సబ్​స్టేషన్ దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉండగా... అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారు బలంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మూడు వాహనాల బీభత్సం... నలుగురు యువకుల దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details