సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేశ్ అలియాస్ మల్లయ్య ప్రస్తుతం సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను 2014లో మోతె మండలానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఏడాదిలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు.
- 2016లో చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన స్రవంతిని రెండో వివాహమాడాడు. ఆమెకు ప్రస్తుతం ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు కడుపులో ఉండగానే భర్త వేధింపులు తాళలేక స్రవంతి పుట్టింటికి వెళ్లిపోయింది. 2018లో ఆమె చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కానిస్టేబుల్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వరకట్న వేధింపులు, భరణం కేసులు న్యాయస్థానంలో కొనసాగుతున్నాయి.
- ఆరు నెలల క్రితం ఓ యువతికి మహేశ్ మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లి సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెన్‌పహాడ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రోజుల తర్వాత యువతిని తీసుకొని కానిస్టేబుల్ సూర్యాపేట డీఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు యువతిని సూర్యాపేటలోని సఖి కేంద్రానికి అప్పగించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయినా అతనిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.
- తాజాగా ఈ ఏడాది అక్టోబరు 29న సూర్యాపేట మండలానికి చెందిన మరో యువతిని ఆమనగల్ దేవాలయంలో వివాహమాడాడు.