ఎస్వోటీ పోలీసుల పేరుతో ఓ వ్యక్తిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నలుగురు సభ్యుల సూడో పోలీసుల ముఠాను మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారానికి చెందిన వర్త్యాల లోకేశ్ ఓల్డ్ సఫీల్గూడాలోని పీబీ కాలనీలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించడానికి వచ్చాడు. ఇది గమనించిన ఆర్టీసీ కాలనీకి చెందిన నలుగురు యువకులు... తాము ఎస్వోటీ పోలీసులమని చెప్పి లోకేశ్‌ను బెదిరించారు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న 19 వేల నగదును దోచుకెళ్లారు.
నకిలీ ఎస్వోటీ పోలీస్ ముఠా అరెస్ట్ - neredmet police arrested fake police gang
మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో ఎస్వోటీ పోలీసులమంటూ... దోపిడీకి పాల్పడ్డ నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.19వేల నగదు, ఓ కారు, ఓ ద్విచక్రవాహనం, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
four fake sot police arrested in neredmet
బాధితుడు లోకేశ్ జరిగిన మోసాన్ని గుర్తించి.... నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు... ఆర్టీసీ కాలనీకి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఓ కారు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని... నిందితులను రిమాండుకు తరలించారు.