ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు నిందితులతో పాటు ఓ కారు, 126 కేజీల గంజాయిని స్వాధీనం
అక్రమంగా గంజాయి తరలిస్తోన్న నలుగురి అరెస్ట్ - భద్రాద్రి జిల్లా నేర వార్తలు
భద్రాచలంలో అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులతో పాటు 126 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా గంజాయి తరలిస్తోన్న నలుగురి అరెస్ట్
ఈ గంజాయి విలువ సుమారు రూ. 19 లక్షలు ఉంటుందని భద్రాచలం ఎస్సై మహేశ్ వెల్లడించారు. భద్రాచలంలోని పలు రహదారుల్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచూడండి.. ఓఆర్ఆర్పై కారు బోల్తా.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు