మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారు సాలార్ తండా సమీపంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాలోని నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.3 లక్షల 50 వేల దొంగనోట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. పరారీలో ఉన్న ఏడుగురు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాలో నలుగురు అరెస్ట్
దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్, పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి.. ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల 50 వేల దొంగనోట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్, పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. మరిపెడ మండలం ధర్మారం తండకు చెందిన గూగులోత్ రామకృష్ణ, పట్టణంలోని గిరిప్రసాద్ నగర్‌కు చెందిన మహేష్, వెంకన్న, నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన ధరావత్ రాందాస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ నరేష్ కుమార్, సీఐలు వెంకటేశ్వరరావు, వెంకటరత్నం, ఎస్సై రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి