వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో గల గణపతి టింబర్ డిపో వద్ద ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పరకాల సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న తండా మహేష్, పూసల రాజేష్, కొమ్ముల అజయ్ కుమార్, కుక్కల సత్యరాజు అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, రూ.16,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. కేసు నమోదు చేశారు.
బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్.. నగదు స్వాధీనం - పరకాలలో బెట్టింగ్ ఆడుతున్న నలుగురి అరెస్ట్ వార్తలు
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, రూ.16,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్.. నగదు స్వాధీనం
బెట్టింగ్ ఆడుతున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పరకాల పోలీస్ సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.
ఇవీ చూడండి: చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!