హైదరాబాద్ తిలక్‌నగర్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై గంజాయి విక్రయిస్తున్న తిలక్‌నగర్‌కు చెందిన కౌశల్య మనోజ్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1.2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. సృజన్ కుమార్ అనే వ్యక్తి సరఫరా చేసినట్లు తెలిపాడు. అనంతరం అధికారులు విద్యానగర్‌లోని సృజన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. రెండు కిలోల ప్యాకెట్లు పదింటిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురి అరెస్ట్ - police arrested four Accused for supplying Marijuana
హైదరాబాద్ నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు.

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి వద్ద కిలో రూ.1500లకు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో కిలో రూ.2500లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందని అంజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మనోజ్సింగ్, అతని సోదరి గాయత్రి, దుర్గేష్, లకన్సింగ్లను అరెస్టు చేసినట్లు వివరించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కాచిగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కుర్నవల్లిలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్‌బియ్యం స్వాధీనం