తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైతును ఇసుక లారీ ఢీకొట్టిన కేసులో నలుగురు అరెస్ట్​

కృత్రిమంగా ఇసుకను తయారు చేసి, అక్రమంగా రవాణా చేస్తూ, రైతు నర్సింహులు మృతికి కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 29న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీ... రైతును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

Four accused arrested in lorry case
రైతును ఢీకొట్టిన లారీ కేసులో... నలుగురు నిందితులు అరెస్ట్​

By

Published : Aug 3, 2020, 11:02 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో కృత్రిమంగా ఇసుకను తయారు చేసి, అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. లారీ డ్రైవర్ రాజు, ఇసుక లారీల యజమానులు శ్రీధర్, లతీఫ్, తయారీదారు వెంకటేశ్​​లను రిమాండ్​కు తరలించారు.

ఈ వ్యవహారంతో మహబూబ్​నగర్ జిల్లాలో రాజకీయ దుమారం రేపింది. ఇసుక మాఫియా ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ తరుణంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. మృతికి కారణమైన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details