నల్గొండ జిల్లా త్రిపురారం మండల అప్పలమ్మగూడెంకు చెందిన గుండెబోయిన వెంకటయ్య(55), అతడి తమ్ముడి కుమారుడు కలసి మిర్యాలగూడ మండలం గద్దగూడు తండా వద్ద మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటయ్యను తమ్ముడి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.
మాజీ రేషన్ డీలర్ హత్య.. భూ వివాదామే కారణమా? - నల్గొండ జిల్లా తాజా వార్తలు
మాజీ రేషన్ డీలర్‌ను హత్య చేసి నీటి కుంటలో పడేసిన ఘటన నల్గొండ మిర్యాలగూడ మండలం గద్దగూడు తండా వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మాజీ రేషన్ డీలర్ హత్య.. భూ వివాదామే కారణమా?
అనంతరం మృతదేహాన్ని నీటి కుంటలో వేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారులు సేకరించారు. మృతుడు వెంకటయ్యకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి:పది రూపాయల కోసం ప్రాణాలు తీశాడు..