మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్లో సెల్ టవర్ ఎక్కి, ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు హల్చల్ చేశాడు. గ్రామానికి చెందిన బాచుపల్లి యాదగిరికి రెవెన్యూ అధికారులు గత నెలలో అసైన్మెంట్ భూమి కేటాయించారు. డంపింగ్ యార్డు నిర్మాణం కోసం కొంత భూమి తిరిగి తీసుకున్నారు. దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కి అధికారులు వచ్చే వరకు దిగనని మొండికేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
సెల్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం - టవర్ ఎక్కి రైతు ఆత్యహత్యాయత్నం
సెల్ టవర్ ఎక్కి ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్లో చోటుచేసుకుంది. ప్రభుత్వం కేటాయించిన భూమి తిరిగి తీసుకోవడం వల్ల మానసిక వేదనకు గురై ఇలా చేసినట్టు తెలుస్తోంది.
సెల్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం