నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడిలో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు వడ్డే హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన హనుమంతు(55), అతని భార్య రెండు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయి తనకుతానే పురుగుల మందు తాగి మరణించింది.
దమ్ము ట్రాక్టర్ ఫల్టీ... పొలంలోనే రైతు మృతి
విధి వక్రించింది. ఓ రైతు ట్రాక్టర్‌తో పొలం పని చేస్తుండగా అది పల్టీ కొట్టింది. అక్కడికక్కడే అన్నదాత విగతజీవిగా మారిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో ఎదిగిన పిల్లలు ఎవరూ లేని వారుగా మిగిలిపోయారు. ఇటీవలే వారి కుటుంబంలో తల్లి సైతం మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన నారాయణ పేట జిల్లాలో జరిగింది.
పల్టీ కొట్టిన ట్రాక్టర్.. విషాదంలో రైతు కుటుంబం
ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా.. మిగతా ఇద్దరు పిల్లలు తోడు లేకుండా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి :పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి తెరాస కార్యకర్త మృతి