ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 24న జరిగిన వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఘర్షణ కేసులో ఐదు మంది వైకాపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పలపాడు రవి, బాబా, కేశవరెడ్డి, ఓబులరెడ్డి, రమణలను అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నించిన సమయంలో నిందితులు వినియోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి... ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్ - jc prabhaker reddy attack issue latest news
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఐదుగురు వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో వినియోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు.
![జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి... ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్ five-ysrcp-leaders-arrested-in-jc-prabhakar-reddy-attack-issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10057382-233-10057382-1609320023123.jpg)
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి... ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్
తాడిపత్రి పట్టణంలో ఈ నెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి... మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లికి వెళ్లి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు.