తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

టపాసుల కోసం వెళ్లి బాలుడు అదృశ్యం - సూర్యాపేట జిల్లా వార్తలు

సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. టపాసుల కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగిరాలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కలకలం సృష్టించిన దీక్షిత్ రెడ్డి అపహరణ, హత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని... గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

five years boy missing in suryapet district
సూర్యాపేటలో బాలుడు అదృశ్యం... టపాసుల కోసం వెళ్లి!

By

Published : Nov 15, 2020, 12:58 PM IST

Updated : Nov 15, 2020, 2:32 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లిన చిన్నారి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన దీక్షిత్ రెడ్డి అపహరణ, హత్యను దృష్టిలో పెట్టుకున్న సూర్యాపేట పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.

టపాసుల కోసం వెళ్లి బాలుడు అదృశ్యం

టపాసుల కోసం వెళ్లి!

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్న పరిక పల్లి మహేశ్, నాగలక్ష్మి కుమారుడు ఐదేళ్ల గౌతమ్ ఇంటి సమీపంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి తిరిగిరాలేదు. దీపావళి సందర్భంగా టపాసులు కొనడం కోసం దుకాణానికి వెళ్ళిన కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేదు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శతృత్వం లేదు

ఆత్మకూర్ (ఎస్ ) మండలం ఏపూరు గ్రామానికి చెందిన బాలుడి తండ్రి మహేశ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ.. సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. మహేశ్‌ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడున్నా తమ కొడుకు క్షేమంగా రావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. రాత్రి నుంచి తమ బిడ్డ ఎంత అవస్థ పడుతున్నాడోనని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ముమ్మరంగా గాలింపు

కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం సీఐ ఆంజనేయులు సహా మరో ముగ్గురు ఎస్సైలు గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అనుమానితులను కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్​

Last Updated : Nov 15, 2020, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details