హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ఆర్.కె.నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రిజ్వాన్ అనే ఐదేళ్ల బాలుడు నీటిసంపులో పడి మృతిచెందాడు. ఆడుతూ పాడుతూ తిరిగే తమ కొడుకు ఒక్కసారిగా విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
నీటిసంపులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి - Telangana Latest News
హైదరాబాద్ తట్టి అన్నారం ఆర్.కె.నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నీటిసంపులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి చెందాడు. కుమారుడి మృతితో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నీటిసంపులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి
అప్పటివరకు ఆడుకుంటున్న రిజ్వాన్ కనిపించకపోవడంతో ఎంతసేపు వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు సంపులో పడిన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చూడండి:ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం