వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదం జరిగింది. ఇంటి మిద్దె కూలిన ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది కిందట చనిపోయాడు. ఆయన సంవత్సరీకం సందర్భంగా కుమారులు, కోడళ్లు, మనుమరాళ్లు గ్రామానికొచ్చారు. కార్యక్రమం ముగిసింది. ఫ్యాన్ ఉందని 11మంది ఒకే గదిలో నిద్రపోయారు.
ఇంటి మిద్దె కూలి ఐదుగురు మృతి
ఇంటి మిద్దె కూలి ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో జరిగింది.
ఇంటి మిద్దె కూలి ఐదుగురు మహిళలు మృతి
ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. గదిలో నిద్రపోతున్న వారిపై పడింది. ఘటనలో ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనుమరాళ్లు అశ్విని, పింకి మృత్యువాత పడ్డారు. మణెమ్మ కుమారుడు కుమార్ తీవ్రంగా గాయపడగా... చికిత్స నిమిత్తం హైదరబాద్ తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు గ్రామస్థల సహకారంతో వెలికి తీశారు.
ఇదీ చూడండి:బైకును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
Last Updated : Oct 25, 2020, 4:51 AM IST