లక్కీ డ్రా పేరుతో మోసాలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు గుర్తించారు. వారినుంచి రూ.19,900 నగదు, 50 లక్కీ డ్రా కాయిన్స్, ఐదు చరవాణులు, 13 ఖాతా పుస్తకాలు, ఓ రిజిస్టర్, గుర్తింపు కార్డులను దక్షిణమండల టాస్క్పోర్స్పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లక్కీ డ్రా పేరుతో మోసగిస్తున్న ఐదుగురు అరెస్ట్ - పాతబస్తీలో లక్కీ డ్రా ముఠా అరెస్ట్
పండుగల వేళ ప్రజలను లూటీ చేసేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. లక్కీ డ్రాల పేరుతో అమాయకులను నిలువున ముంచేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను దక్షిణమండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
![లక్కీ డ్రా పేరుతో మోసగిస్తున్న ఐదుగురు అరెస్ట్ Five persons arrested for cheating with lucky draw at old city in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10214483-83-10214483-1610450062581.jpg)
లక్కీ డ్రాతో మోసగిస్తున్న ఐదుగురు అరెస్ట్
ఆర్జేఎం ఎంటర్ప్రైజెస్ పేరుతో పాతబస్తీలోని ఈద్గా, మాదన్నపేట్ వద్ద లక్కీ డ్రా నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. బహుమతులు ఆశ చూపి అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు దోచేస్తున్నారు. అనంతరం వారిని రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించారు.