శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో కారు డ్రైవర్, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - road accident in ap
శ్రీకాకుళం జిల్లా మందసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరంతా ఒడిశాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సింహాచలంలో స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
road accident in srikakulam
మృతులంతా ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కారును, మృతదేహాలను వెలికితీశారు. సింహాచలంలోని అప్పన్న స్వామి దర్శనానంతరం ఒడిశాలోని బ్రహ్మపుత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో డోర్ లాక్ పడిపోవడం వల్ల బాధితులు తప్పించుకోలేకపోయారు.
ఇదీ చూడండి:చనిపోయినోళ్లను బతికించారు.. బతికున్నోళ్లను చంపేశారు!
Last Updated : Jan 4, 2020, 11:04 AM IST