ఏపీలోని విశాఖ మన్యం జి.కె.వీధి మండలం పెదపాడు, వైకుంఠపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. పెదపాడు గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మణరావు అలియాస్ లింగు, తాంబెలు తీల్సు, తాంబెలు బంగార్రాజు, వైకుంఠపల్లి గ్రామానికి చెందిన కిల్లో రూబెన్, వంతల లక్ష్మణరావు...మావోయిస్టు నేత జాంబ్రి కాలం నుంచి వీరు మిలిషియా సభ్యులుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలిషియా సభ్యులు - ఏపీ నేర వార్తలు
ఏపీలోని విశాఖ మన్యం పెదపాడు, వైకుంఠపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరంతా మావోయిస్టు జాంబ్రి కాలం నుంచి మిలిషియా సభ్యులుగా పని చేస్తున్నట్లు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మావోయిస్టులకు భోజనాలు ఏర్పాటు, నిధుల సమీకరణలో తోడ్పాడు అందించేవారని చెప్పారు. లొంగిపోయిన మిలిషియా సభ్యులకు ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని ఏఎస్పీ స్పష్టం చేశారు.
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలిషియా సభ్యులు
మావోలకు భోజనాలు ఏర్పాటు, జన సమీకరణ, నిధుల సేకరణ చేసేవారని పోలీసులు తెలిపారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో మావోల ప్రాబల్యం తగ్గిందని, మావోయిస్టు కుంకుమపూడి హరి అరెస్టు తర్వాత మిలిషియా సభ్యులు పరివర్తన చెంది స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్నారు. లొంగిపోయిన వారు ప్రశాంతంగా జీవనం సాగించడానికి ప్రభుత్వం, పోలీసుశాఖపరంగా తోడ్పాటు అందిస్తామని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.