చేపలను పట్టేందుకు వెళ్లిన ఓ మత్స్య కార్మికుడు ఆ చెరువులోనే గల్లంతైన ఘటన... కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నేదురి రవి అనే వ్యక్తి... నాయిని చెరువులోకి చేపలను పట్టేందుకు వెళ్లాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో భారీగా నీరు చేరింది. చేపలు పట్టేందుకు రవి చెరువులోకి దిగగా నీటి ప్రవాహానికి కొట్టుకపోయాడు.
చేపల కోసం చెరువులోకి వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని నాయిని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
చేపల కోసం చెరువులోకి వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
అక్కడే ఉన్న తోటి మత్స్య కార్మికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న సీఐ సృజన్‌రెడ్డి, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు చెరువు వద్దకు చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రవి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.