సముద్రంలో వేట సాగించే విషయంలో రెండు వర్గాల మత్స్యకారుల మధ్య జరిగిన గొడవ సినిమా ఛేజింగ్‌ను తలపించింది. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల పరిధిలోని సముద్రంలో మత్స్యకారుల గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. చేపలు పట్టుకునే విషయంలో వాడరేవు మత్స్యకారులు- కఠారిపాలెం, పోట్టిసుబ్బయ్య పాలెం, రామచంద్రాపురం జాలరుల మధ్య వివాదం తలెత్తింది. వాడరేవు జాలర్లు తమ పరిధిలోకి వచ్చి చేపలు పడుతున్నారని.. మిగతా మూడు గ్రామాల మత్స్యకారులు గొడవకు దిగారు. నడుస్తున్న పడవలపైనే ఇరువర్గాలు పరస్పరం గొడవపడ్డాయి. ఆ తర్వాత ఒంగోలు వెళ్లి జిల్లా మత్స్యశాఖ అధికారులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వివాదాలకు పోవద్దని వారికి హితవు పలికిన అధికారులు.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని నచ్చజెప్పి పంపారు.
అసలు సమస్య ఏంటి..?