భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో 23 ఎకరాల కంది, 7 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, గ్రామస్థులతో కలిసి మంటలను అదుపు చేశారు.
ముప్పై ఎకరాల పంట దగ్ధం.. రైతులకు మంత్రి భరోసా! - ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామం వార్తలు
మామిడి గుండాల గ్రామంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో కంది, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఘటనాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రియ.. విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ముప్పై ఎకరాల పంట దగ్ధం.. రైతులకు మంత్రి భరోసా
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హరిప్రియ దగ్ధమైన పంట పొలాలను పరిశీలించి.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ ఎన్.వి.రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకువెళ్లి రైతులకు పరిహారం అందేలా చూస్తానని స్థానిక సర్పంచ్ కృష్ణకు, రైతులకు భరోసా ఇచ్చారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కల్మషం లేని మా సయ్యాట చూస్తారా!
TAGGED:
mla hari priya latest visit