తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విశాఖలో అగ్నిప్రమాదం... రసాయనాలు దగ్ధం.. - విశాఖ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ విశాఖ గేట్​ వే కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. కంటైనర్లలో ఉన్న ప్రమాదకర రసాయనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

VSP_Container corporation Fire Accident_Taza
విశాఖలో అగ్నిప్రమాదం... రసాయనాలు దగ్ధం..

By

Published : Jul 27, 2020, 6:12 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలోని షీలానగర్​ సీఎఫ్​ఎస్ కంటైనర్ యార్డులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలు మండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి.

కంటైనర్లలోని హానికర రసాయనాలు దగ్ధమై దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించింది. అగ్నిప్రమాదంతో ఎల్లపువానిపాలెం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ఇదీ చదవండి: టైటానిక్ ప్రేమికులు పెట్టుకున్నారు మాస్కులు!

ABOUT THE AUTHOR

...view details