తాళం వేసిన ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో చోటుచేసుకుంది. 10లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
బయటపడ్డ వృద్ధుడు..
గ్రామంలోని చొప్పరి.సాయిలుకు వెంకన్న, సురేష్ అనే ఇద్దరు కొడుకులున్నారు. వీళ్లు, తండ్రి వేరుగా నివసిస్తున్నారు. వృద్దుడు ఇంటి వద్ద ఉండగా కుమారులు ఈ రోజు ఉదయం.. పొలం వద్దకు వెళ్లారు. ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వృద్ధుడిని బయటకు తీసుకొచ్చారు.
భయంతో..
ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారమిచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. మహబూబాబాద్ నుంచి ఘటనా స్థలికి అది చేరుకునే లోపు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్లు పేలుతాయన్న భయంతో ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు.