హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నబీకరీం బస్తీలో ఘటన జరిగింది. కట్టెల కార్ఖానా సహా పక్కనే ఉన్న మెకానిక్ షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు - పాతబస్తీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీలోని నబీకరీం బస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు.
పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీచూడండి:క్రికెట్ బెట్టింగ్‌లో నష్టం.. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం