తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏపీ విశాఖలో మరో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం - vizag latest fire accident news

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో షీలానగర్‌ దరి గేట్‌వే ఈస్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ. 10లక్షల విలువైన సోడియం క్లోరైడ్ పొడితోపాటు మూడు కంటైనర్లు స్వల్పంగా దగ్ధమయ్యాయని సిబ్బంది తెలిపారు.

ఏపీ విశాఖలో మరో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం
ఏపీ విశాఖలో మరో ప్రమాఏపీ విశాఖలో మరో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టందం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం

By

Published : Jul 28, 2020, 11:19 AM IST

ఏపీ విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌, సాయినార్‌ ఫార్మా, సాల్వెంట్స్‌ ప్రమాదాల్ని మరువకముందే షీలానగర్‌ దరి గేట్‌వే ఈస్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ యార్డులోని కంటైనర్‌ టెర్మినల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఓ కంటైనర్‌ నుంచి మరో కంటైనర్‌లోకి సోడియం క్లోరైడ్‌ పొడిని మారుస్తుండగా ఓ బస్తా లీకైంది. బస్తాలు మారుస్తున్న ఫోర్క్‌ లిఫ్ట్‌నకు పొడి రాపిడి జరిగి మంటలు చెలరేగాయి.

బూడిదైన సోడియం క్లోరైడ్ పొడి కంటైనర్​

వెంటనే అప్రమత్తమైన ఫోర్క్‌ లిఫ్ట్‌ ఆపరేటర్‌, అక్కడ పని చేస్తున్నవారు పరుగులు తీశారు. మంటలతోపాటు దట్టమైన పొగ రావటం వల్ల సిబ్బంది, స్థానికులు ఆందోళన చెందారు. పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల విలువైన సోడియం క్లోరైడ్‌ పొడితోపాటు మూడు కంటైనర్లు స్వల్పంగా దగ్ధమయ్యాయి.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details