కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం సంఘం బస్తీలో ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఓ ఇల్లు దగ్ధమైంది. మంటలకు ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధం కాగా రూ. 15 వేలు నగదు కాలిపోయిందని ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న లక్ష్మణ్ విలపించాడు.
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.. ఇంట్లోని సామగ్రి దగ్ధం - కుమురం భీం జిల్లాలో సంఘం బస్తీలో అగ్ని ప్రమాదం
ప్రమాదవశాత్తు ఓ ఇల్లు మంటలకు ఆహుతైన ఘటన కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు.
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.. ఇంట్లోని సామగ్రి దగ్ధం
శనివారం ఉదయం లక్ష్మణ్.. కుటుంబంతో కలిసి బయటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత ఇంటి లోపలి నుంచి పొగలు వస్తుండటం గమనించిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు విచారణ చేపట్టారు.