మహబూబాబాద్ జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని మీసేవ కేంద్రంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మీ సేవాలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
మీసేవ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 5 లక్షల ఆస్తినష్టం - మహబూబాబాద్ మీసేవా కేంద్రంలో అగ్నిప్రమాదం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మీసేవ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగింది.
అగ్ని ప్రమాదం, మహబూబాబాద్, మీ సేవా
ఈ ప్రమాదంలో 3 ల్యాప్‌టాప్‌లు, జిరాక్స్ మిషన్, 4 ప్రింటర్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మీసేవ నిర్వాహకుడు తెలిపాడు. కేంద్రం మూసివేసి ఇంటికి వెళ్లిన గంట లోపే ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నాడు.