సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ పరిధిలో అగ్నిప్రమాదం - మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం
07:38 September 16
మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ పరిధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హౌస్ కీపింగ్ హోల్‌సేల్ దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది... యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు ఐదు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఘటన సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పిడుగు పడి ద్విచక్ర వాహనం దగ్ధం