హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు మహిళా వసతి గృహంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఐదవ అంతస్తులో షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గదిలో ఉన్న ఇద్దరు యువతులను పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ప్రమాదంలో ఆరు బెడ్లు, రెండు ల్యాప్ టాప్‌లు, ఫోన్, పుస్తకాలు, బట్టలు దగ్ధం అయ్యాయి.
ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - హిమాయత్‌నగర్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్‌లోని 5 వ అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలు వస్తువులు దగ్ధం కాగా యువతులను సురక్షితంగా బయటకు తరలించారు.
![ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం fire accident in private women's hostel himayath nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9390851-347-9390851-1604228078418.jpg)
ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించిన నారాయణగూడ పోలీసులు.. హాస్టల్లో ఉన్న వాటర్ ట్యాంక్ నీటితో మంటలను ఆర్పారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకవచ్చారు.
ఇదీ చదవండి:లాడ్జిలో... 20కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం