తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నారాయణగూడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం - హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నారాయణగూడలోని ఓ డ్రైక్లీనింగ్‌ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మొదట కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ప్రమాదం జరిగిందని భావించినప్పటికీ... కార్యాలయం కింద అంతస్తులో ఉన్న బట్టల డ్రై క్లీనింగ్‌ దుకాణంలో మంటలు చెలరేగినట్టు తేలడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నారాయణగూడలో అగ్నిప్రమాదం
నారాయణగూడలో అగ్నిప్రమాదం

By

Published : Dec 28, 2020, 5:57 AM IST

హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది. నారాయణగూడలోని ఓ డ్రైక్లీనింగ్‌ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. కెనరా బ్యాంకు కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తున్నట్టు స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... కార్యాలయం అద్దాలు పగులగొట్టి చూడగా దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు అదుపు చేయడానికి భవనం కిటికీ అద్దాలు పగలగొడుతుండగా.. దస్తగిరి అనే ఉద్యోగికి గాయాలయ్యాయి. మూడు యంత్రాలతో అధికారులు మంటలు అదుపుచేశారు.

ఇదీ చూడండి:మంత్రి కేటీఆర్​ పేరు వాడుకుని మోసం చేయాలనుకుని...

ABOUT THE AUTHOR

...view details