నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి 8 వ వార్డులో విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం అయింది. ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ వైర్లు తెగి గుడిసె మీద పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. గుడిసెలో ఉన్న వస్తువులు, విలువైన పత్రాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే సరికి గుడిసె పూర్తిగా దగ్ధం అయింది.
విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం - నేర వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుదాఘాతం సంభవించింది. ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు చెలరేగి పూరి గుడిసె మీద పడటంతో గుడిసె పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న వాళ్లు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది.
విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
ప్రమాదం సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. వైర్లు తెగడంతో కాలనీలోని పలువురి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో పెరుగుతున్న ఆక్సిడెంట్లు కారణమేంటో తెలుసా?