భద్రాచలం పాతమార్కెట్‌లోని ఓ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు... యాజమానికి సమాచారమందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని షటర్ తెరిచి చూడగా... అప్పటికే దుకాణంలోని సామగ్రితో పాటు చరవాణులు అగ్నికి ఆహుతయ్యాయి.
విద్యుదాఘాతంతో మొబైల్ షాప్ దగ్ధం... 15 లక్షల నష్టం - bhadrachalam latest news
విద్యుదాఘాతం వల్ల భద్రాచలం పాతమార్కెట్‌లోని ఓ మొబైల్ దుకాణం అగ్నికి ఆహుతైంది. స్థానికులు గమనించి తెరిచేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 15 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు దుకాణ యజమాని తెలిపాడు.
fire accident in mobile shop in bhadrachalam
ఈ ప్రమాదంలో 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.