సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం ఆర్ఎండ్ఆర్ కాలనీలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, కుటుంబసభ్యులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో రూ. లక్ష పైనే ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.
షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధం.. రూ. లక్ష మేర ఆస్తి నష్టం - సిద్దిపేటలో అగ్నిప్రమాదం కిరాణా షాపు
సిద్దిపేట జిల్లా తునికి బొల్లారం ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్న కిరాణా దుకాణంలో షార్ట్సర్క్యూటై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి షాపులో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం రూ. లక్షపైనే ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని వెల్లడించారు.
షార్ట్ సర్క్యూటై షాపు దగ్ధం.. రూ. లక్ష మేర ఆస్తి నష్టం
కొండపోచమ్మ ముంపు గ్రామం మామిడ్యాలకు చెందిన భూ నిర్వాసితులు ఆంజనేయులు.. కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు శనివారం ఉదయం షార్ట్ సర్క్యూటై.. షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రభుత్వం తమను ఆదుకుని కుటుంబీకులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం