కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తినష్టం
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తినష్టం - latest fire accident news
ఖమ్మం జిల్లా మధిర మండలం ఖాజీపురం వద్ద గల ఓ కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగటం వల్ల... క్షణాల్లోనే పత్తిబేళ్లు, యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.
![కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తినష్టం fire accident in cotton mill at khajipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9811681-614-9811681-1607437974083.jpg)
fire accident in cotton mill at khajipur
ఖమ్మం జిల్లాలోని ఓ కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధిర మండలం ఖాజీపురం వద్ద కాటన్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించటం వల్ల చూస్తుండగానే... పత్తిబేళ్లు, యంత్రాలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు యాజమాన్యం పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.