తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జాతీయ రహదారిపై కంటైనర్ దగ్ధం... - తెలంగాణ వార్తలు

షార్ట్‌ సర్క్యూట్‌తో కామారెడ్డి జిల్లా అంతంపల్లి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పి వేశారు.

fire-accident-in-container-cabin-at-anthampally-village-in-kamareddy-district
జాతీయ రహదారిపై కంటైనర్ దగ్ధం... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

By

Published : Jan 2, 2021, 2:35 PM IST

షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్‌ఫోర్ట్‌కు సంబంధించిన కంటైనర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కంటైనర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్... కిందికి దూకాడు. ఈ క్రమంలో డ్రైవర్ చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.

న్యూ దిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కంటైనర్ దగ్ధంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూరు పోలిసులు తెలిపారు.

ఇదీ చదవండి:అమానుషం... పంటపొలల్లో శిశువు మృతదేహం

ABOUT THE AUTHOR

...view details