తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గ్యాస్​ లీకై అపార్ట్​మెంట్​లో చెలరేగిన మంటలు - గ్యాస్ లీకై అగ్నిప్రమాదం

గ్యాస్​ లీకేజీతో అపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగిన ఘటన... హైదరాబాద్​ చిక్కడపల్లి పరిధిలోని దోమలగూడలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అపార్టమెంట్​ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

fire accident in chikkadpally gaganmhal thulips apportment
గ్యాస్​ లీకై అపార్ట్​మెంట్​లో చెలరేగిన మంటలు

By

Published : Aug 16, 2020, 1:42 PM IST

హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలోని దోమలగూడలో గగన్ మహల్ తులిప్స్ అపార్ట్​మెంట్​లో గ్యాస్​ లీకేజీతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అపార్టుమెంటువాసులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో అంతస్తులోని 301 ప్లాట్​లో పొగతో కూడిన మంటలను చూసి... అపార్ట్ వాసులందరూ భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details