ప్రమాదవశాత్తు ఇంజిన్లో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగింది. అల్గోల్ గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి కారులో వెళ్ళాడు. ఇంటికి వచ్చేందుకు కారును వెనక్కి తీస్తుండగా ఇంజిన్లో పొగలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేశారు.
అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన కారు - సంగారెడ్డిలో కారులో అగ్ని ప్రమాదం
ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగింది. మంటలను గుర్తించిన వెంటనే కారు నుంచి దిగిపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.
అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన కారు
అప్రమత్తమైన విక్రమ్ రెడ్డి కారు నుంచి దిగిపోయాడు. చూస్తుండగానే మంటలు వ్యాపించి క్షణాల్లో బూడిదయింది. ఘటనలో ప్రాణాపాయం తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: ఆసీస్ ఆయిల్ విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్ట్