కుమురం భీం ఆసిఫాబాద్‌లో అటవీ చెక్‌పోస్టు సమీపంలో గల శ్రీ భక్తమార్కండేయ ఆలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం అర్చకుడు దూప, దీప, నైవేద్య కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్లారు. అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో చెలరేగుతున్న మంటలను గమనించారు.
ఆలయంలో మంటలు.. తప్పిన ప్రమాదం - శ్రీ భక్తమార్కండేయ ఆలయంలో అగ్ని ప్రమాదం
కుమురం భీం ఆసిఫాబాద్‌లోని శ్రీ భక్తమార్కండేయ ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రూ.30 వేల వరకు ఆస్తినష్టం జరిగినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
![ఆలయంలో మంటలు.. తప్పిన ప్రమాదం fire accident in asifabad sri bhaktha markendeya temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10547478-thumbnail-3x2-fire.jpg)
ఆలయంలో మంటలు.. రూ.30 వేల ఆస్తినష్టం
భక్తుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆలయంలో దీపాల ద్వారా ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.30 వేల ఆస్తినష్టం జరిగినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి:రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం