స్క్రాప్ గోదాములో అగ్నిప్రమాదం.. చెలరేగుతున్న మంటలు - fire accident in a scrap godown

11:58 May 08
స్క్రాప్ గోదాములో అగ్నిప్రమాదం.. చెలరేగుతున్న మంటలు
ఆదిలాబాద్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని ఇండేన్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.15 లక్షల విలువైన స్క్రాప్ అగ్నికి ఆహుతయినట్లు యజమాని తెలిపారు.
ఇదీచూడండి: తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు