మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పరిధి రంగారెడ్డినగర్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న శక్తి పెయింట్స్ కంపెనీలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. గమనించిన వాచ్మెన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.
పెయింట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - rangareddy nagar fire accident news
మేడ్చల్ జిల్లా బాలానగర్ పరిధి రంగారెడ్డినగర్లోని ఓ పెయింట్స్ పరిశ్రమలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.
![పెయింట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం fire accident in a paints company at rangareddy nagar in medchal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7402619-842-7402619-1590809845120.jpg)
పెయింట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెయింట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం