తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

షిమోగా దాబాలో అగ్నిప్రమాదం... వంట సామగ్రి దగ్ధం - సికింద్రాబాద్​లోని దాబాలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఉన్న షిమోగా దాబాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

fire-accident-in-a-daba-at-secunderabad-in-hyderabad
షిమోగా దాబాలో అగ్నిప్రమాదం... వంట సామగ్రి దగ్ధం

By

Published : Nov 11, 2020, 2:58 PM IST

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. షిమోగా దాబాలో షార్ట్​ సర్యూట్​ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన వల్ల దాబాలోని వస్తువులు, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఒక్కసారిగా మంటలు ఎగసిపడడం వల్ల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే మంటలు ఆర్పడం వల్ల స్థానికులు, పైన ఉన్న లాడ్జ్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

ABOUT THE AUTHOR

...view details