తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పత్తి గోదాము నుంచి ఎగిసిపడ్డ పొగలు

వ్యవసాయ కార్యాలయంలోని వ్యర్థాలకు నిప్పుపెట్టడం వల్ల పక్కనే ఉన్న పత్తి గోదాములో మంటలు అంటుకున్నాయి. భారీగా పొగలు ఎగిసిపడగా... సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో చోటుచేసుకుంది.

By

Published : May 29, 2020, 5:15 PM IST

fire accident happened in gadwala cotton godowns
పత్తి గోదాము నుంచి ఎగిసిపడ్డ పొగలు

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని పత్తి గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయశాఖ కార్యాలయంలో పది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న ఫైల్స్​, సీజ్​ చేసిన విత్తనాలు, బయో కెమికల్​ ప్యాకెట్లు... అటెండర్​ మస్తాన్​ దగ్ధం చేశాడు. ఈ క్రమంలో మంటలు భారీగా ఎగిసిపడ్డి... పక్కనే ఉన్న పత్తి గోదాముకు నిప్పంటుకుంది.

పత్తి గోదాము నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం వల్ల స్థానికులు ఆందోళన చెందారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వృథాగా ఉన్న ఫైల్స్​, విత్తనాల ప్యాకెట్లకు నిప్పుపెట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని వ్యవసాయ అధికారి చక్రి నాయక్​ తెలిపారు.

ఇదీ చూడండి:'తబ్లీగీ' అక్రమ లావాదేవీలపై సీబీఐ విచారణ!

ABOUT THE AUTHOR

...view details