తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యాదాద్రి ఆలయ కాటేజీ వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఐరన్​ పైపులు - యాదగిరి గుట్టలో అగ్నిప్రమాదం

యాదాద్రీశుడి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. తులసీ కాటేజీ పక్కన చెత్త తగలపెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. కాగా సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

fire accident at yadadri cottages in yadadri bhuvanagiri district yadagirigutta
యాదాద్రి ఆలయ కాటేజీ వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఐరన్​ పైపులు

By

Published : Nov 9, 2020, 7:48 PM IST

యాదాద్రి భువనగిరిజిల్లా యాదగిరిగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి ఆలయ వసతి గృహ సముదాయం తులసీ కాటేజీ ‌పక్కన చెత్త తగలపెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు సంభవించాయి. వసతి గృహ సముదాయం వద్ద ఉంచిన ఐరన్ పైపులకు మంటలు అంటుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సహాయంతో‌ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, సకాలంలో మంటలు ఆర్పడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చూడండి:అర్ధరాత్రి అగ్ని ప్రమాదం... వృద్ధురాలు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details