జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో తెల్లవారుజామున.. ఓ ఆటోమొబైల్ స్టోర్లో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నుంచి భారీగా మంటలు ఎగిసిపడగా స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు.
రాయికల్లో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షలు ఆస్తినష్టం - jagityal district latest news
ఆటోమొబైల్ స్టోర్లో అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 20 లక్షల మేర ఆస్తినష్టం కలిగిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలకేంద్రంలో జరిగింది. స్థానికుల సమాచారంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
రాయికల్లో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షలు ఆస్తినష్టం
ద్విచక్రవాహనాలు, ఇతర సామగ్రి కాలిపోగా.. సుమారు రూ. 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి ఉండవచ్చని యజమాని అనుమానిస్తున్నారు.