నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో జిన్నింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలు వ్యాపించకుండా నియంత్రించారు.
సీసీఐ పత్తికొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం - నారాయణపేట జిల్లా తాజా వార్తలు
నారాయణ పేట జిల్లా ఊట్కూరులోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ఆర్పివేశారు. తక్కువ సమయంలోనే మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సీసీఐ పత్తికొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని బయటి ప్రాంతంలో మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని... విద్యుత్, టెక్నికల్ సిబ్బంది పరిశీలించిన అనంతరం తెలుస్తుందని అధికారులు తెలిపారు. తక్కువ సమయంలోనే మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:వైకాపా నేత భూ ఆక్రమణ.. రైతు ఆత్మహత్యాయత్నం!