నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రం సమీపంలో బొలెరో వాహనంలో పశుగ్రాసం తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నిప్పులు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురిని కాపాడారు.
అగ్నికి ఆహుతైన పశుగ్రాసం... నలుగురికి తప్పిన ప్రమాదం - నిర్మల్ జిల్లా లేటెస్ట్ న్యూస్
పంటపొలంలో పశుగ్రాసం తరలిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై నలుగురిని కాపాడి... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.4.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

అగ్నికి ఆహుతైన పశుగ్రాసం... నలుగురికి తప్పిన ప్రమాదం
ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.