ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన పెద్ద ప్రమాదం తప్పింది. రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పటించారు. అవికాస్త ఎగసిపడుతూ 11కేవీ విద్యుత్ తీగలకు అంటుకున్నాయి. మంటలు వ్యాపించి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మొగిలి అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రమాదాన్ని నివారించారు. కాసేపు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోనందున అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అటు నుంచి వెళ్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలసుకున్నారు.
జాతీయ రహదారి పక్కన అగ్ని ప్రమాదం - అగ్ని ప్రమాదంతో తెగిన విద్యుత్ తీగలు
ఖమ్మం జిల్లా కొణిజర్ల జాతీయ రహదారి పక్కన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పంటించడం వల్ల విద్యుత్ తీగలకు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
![జాతీయ రహదారి పక్కన అగ్ని ప్రమాదం fire accident at konijarla national highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7002898-thumbnail-3x2-asdf.jpg)
జాతీయ రహదారి పక్కన అగ్ని ప్రమాదం