తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం.. 40 క్వింటాళ్ల పత్తి దగ్ధం - fire accident at jinnig mill Kumaram Bheem Asifabad

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సుమారుగా 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి తెలిపారు.

fire accident at jinnig mill Kumaram Bheem Asifabad
జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం.. 40క్వింటాళ్ల పత్తి దగ్ధం

By

Published : Jan 11, 2021, 3:16 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 40 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. తక్షణమే స్పందించిన జిన్నింగ్ మిల్ సిబ్బంది.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారుగా 5లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి తెలిపారు.వారు తక్షణమే స్పందించడంతో భారీ నష్టం తప్పింది. లేకుంటే నష్టం కోట్లలో ఉండేది.

ఇదీ చూడండి: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details