తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జిన్నారం మండలంలో కారు, బైక్ ఢీ... చెలరేగిన మంటలు - సంగారెడ్డి జిల్లా లేటెస్ట్ న్యూస్

సంగారెడ్డి జిల్లా కిష్టయ్యపల్లి శివారులో కారు, బైకును ఢీకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ప్రైవేటు పరిశ్రమకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident at jinnaram in sangareddy district
జిన్నారం మండలంలో కారు, బైక్ ఢీ... చెలరేగిన మంటలు

By

Published : Nov 9, 2020, 12:08 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయ్య పల్లి శివారులో కారు, బైక్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఓ పరిశ్రమలో పనిచేసే కిషోర్ అనే వ్యక్తి కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దాచారం గ్రామానికి చెందిన బాబుల్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ ప్రైవేటు పరిశ్రమకు చెందిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి... మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయమని స్థానికులు తెలిపారు.

జిన్నారం మండలంలో కారు, బైక్ ఢీ... చెలరేగిన మంటలు

ఇదీ చదవండి:మోత్కూర్ సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details