ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శ్రీ హరిపురానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని, పక్క గ్రామమైన వడాలికి సాయిరెడ్డి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఎస్సీ సామాజికవర్గానికి చెందడం వల్ల సాయిరెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి సాయిరెడ్డితో పాటు కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మోసం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని అరెస్ట్ చేసి, ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సాయిరెడ్డి కుటుంబం అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో, కొంతమంది కేసు ఉపసంహరించుకోవాలని యువతి కుటుంబంపై ఒత్తిడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.